భారత్‌లో 2 కోట్ల డోసుల పంపిణీ! - india vaccination crosses 2 doses
close
Published : 07/03/2021 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 2 కోట్ల డోసుల పంపిణీ!

ప్రపంచవ్యాప్తంగా 29.9కోట్ల డోసులు

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. జనవరి 16న దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ద్వారా ఇప్పటివరకు 2కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో కోటి 71లక్షల మందికి తొలి డోసు అందించగా, మరో 37లక్షల 54వేల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 14లక్షల 24వేల డోసులను అందించగా, ఆదివారం నాటికి దేశంలో 2,09,22,344 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు 21లక్షల డోసులను అందించగా, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 17లక్షల చొప్పున కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను అందించారు.

ప్రపంచ వ్యాప్తంగా 29.9కోట్ల డోసులు..

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 111దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా ఇప్పటివరకు 29.9కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిత్యం దాదాపు 76లక్షల డోసుల పంపిణీ జరుగుతోంది. కొవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 8కోట్ల 79లక్షల డోసులను పంపిణీ చేశారు. చైనాలో 5కోట్లు, ఈయూలో 3.9కోట్లు, బ్రిటన్‌లో 2.2కోట్ల డోసులను అందించినట్లు సమాచారం. తర్వాతి స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పటివరకు 2కోట్ల డోసులను అందించింది. తొలి దశలో భాగంగా దాదాపు కోటి మందికి అందించగా, మార్చి నెల నుంచి రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని