గబ్బా టెస్టు: తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా 65/2 - india vs australia final test updates
close
Published : 15/01/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గబ్బా టెస్టు: తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా 65/2

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో ఆరంభమైన నాలుగో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. భోజన విరామ సమయానికి ఆ జట్టు స్కోర్‌ 65/2గా నమోదైంది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(1), మార్కస్‌ హారిస్‌(5) విఫలమయ్యారు. 17 పరుగులకే వారిద్దరూ ఔటయ్యారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే సిరాజ్‌.. వార్నర్‌ను ఔట్‌చేసి టీమ్‌ఇండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. స్లి‌ప్‌లో రోహిత్‌ చేతికి చిక్కడంతో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే శార్దూల్ ఠాకుర్‌ బౌలింగ్‌లో హారిస్‌ ఔటయ్యాడు. ఆపై జోడీ కట్టిన స్మిత్‌(30*), లబుషేన్‌(19*) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి జట్టు 65/2తో నిలిచింది. వీరిద్దరూ ఇప్పటివరకు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇవీ చదవండి..
2001.. ఓడామంటే భజ్జీ వల్లే: స్టీవ్‌వా
టీమ్ఇండియా కష్టాలు నాకూ తెలుసు: పైన్‌

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని