చెన్నై టెస్టు: రూట్‌ 150+, స్టోక్స్‌ 60+ - india vs england first test second day updates
close
Updated : 06/02/2021 12:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెన్నై టెస్టు: రూట్‌ 150+, స్టోక్స్‌ 60+

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌(156), బెన్‌స్టోక్స్‌(63) దూసుకుపోతున్నారు. 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 119 ఓవర్లకు 355/3 స్కోర్‌ సాధించింది. కాగా, రూట్‌కిది 100వ టెస్టు కావడం విశేషం. అయితే, ఇంతకుముందు శ్రీలంకతో ఆడిన 98, 99 టెస్టుల్లోనూ అతడు 150+ స్కోర్లు సాధించాడు. ఆ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 228, 186 పరుగులు సాధించాడు. అదే జోరుతో ఇప్పుడు హ్యాట్రిక్‌ శతకంతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా ఇప్పటివరకు రెండు వికెట్లు తీయగా, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. రెండో రోజు వికెట్లు తీసేందుకు టీమ్‌ఇండియా బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని