టీమ్ఇండియాపై ఇంగ్లాండ్‌కిదే అత్యుత్తమం..! - india vs england second odi records
close
Updated : 27/03/2021 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్ఇండియాపై ఇంగ్లాండ్‌కిదే అత్యుత్తమం..!

(Photo: BCCI)

ఇంటర్నెట్‌డెస్క్‌: పుణె వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన.. ఇంగ్లిష్‌ జట్టు ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేఎల్‌ రాహుల్‌(108; 114 బంతుల్లో 7x4, 2x6) శతకానికి తోడు పంత్‌(77; 40 బంతుల్లో 3x4, 7x6), కోహ్లీ(66; 79 బంతుల్లో 3x4, 1x6) అర్ధశతకాలు సాధించారు. చివర్లో హార్దిక్‌ పాండ్య(35; 16 బంతుల్లో 1x4, 4x6) దంచికొట్టడంతో భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.

అనంతరం ఇంగ్లాండ్‌ ఓపెనర్లు జేసన్‌రాయ్‌(55; 52 బంతుల్లో 7x4, 1x6), జానీ బెయిర్‌స్టో ‌(124; 112 బంతుల్లో 11x4, 7x6) తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించగా, తర్వాత వచ్చిన బెన్‌స్టోక్స్‌(99; 52 బంతుల్లో 4x4, 6x10) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ 43.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో 1-1తో సిరీస్‌ను సమం చేసింది.

ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..

* వన్డే చరిత్రలో టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌కిదే అత్యుత్తమ భారీ ఛేదన

* ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టోకు ఇది 11వ శతకం. ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు. అతడికిది 78వ ఇన్నింగ్స్‌. హషీమ్‌ ఆమ్లా 64, క్వింటన్‌ డికాక్‌ 65, బాబర్‌ అజామ్‌ 71 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 11వ సెంచరీ సాధించారు.

* అంతర్జాతీయ క్రికెట్‌లో అదిల్‌ రషీద్‌.. విరాట్‌ కోహ్లీని తొమ్మిది సార్లు ఔట్‌ చేశాడు. అంతకుముందు కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ అత్యధికంగా పది సార్లు టీమ్‌ఇండియా సారథిని పెవిలియన్‌ పంపాడు.

* మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న తొలి టీమ్‌ఇండియా ఆటగాడిగా విరాట్‌ రికార్డు సృష్టించాడు. మొత్తంగా రెండో ఆటగాడిగా ఉన్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ (12662) ఈ ఘనత సాధించాడు.

* వన్డేల్లో టీమ్‌ఇండియా తరఫున ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు(8) ఇచ్చిన బౌలర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌ అనవసరపు రికార్డు నమోదు చేశాడు. ఇంతకుముందు 2013లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వినయ్‌కుమార్‌(7) సిక్సులు సమర్పించుకున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని