మిథాలి.. నీకు నువ్వే సాటి!  - indian odi captain mithali raj becomes the first womens cricketer to complete 7000 odi runs
close
Published : 15/03/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మిథాలి.. నీకు నువ్వే సాటి! 

వన్డేల్లో కొత్త రికార్డు.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్‌ఇండియా వన్డే జట్టు సారథి మిథాలిరాజ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ ఫార్మాట్‌లో ఏడు వేల పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో మిథాలి(45; 71 బంతుల్లో 4x4) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ క్రమంలోనే వన్డేల్లో కొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ ట్వీట్‌ చేసి మిథాలిని అభినందించింది.

‘అద్భుతమైన క్రికెటర్‌ మిథాలి. టీమ్‌ఇండియా సారథి వన్డేల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఆమె ఎంతో ఉత్తమమైన క్రికెటర్‌’ అని ప్రశంసించింది. మరోవైపు ఇదే ఫార్మాట్‌లో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఇదివరకు మిథాలి సత్తా చాటారు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ 5,992 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు ఇదే దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మిథాలి 36 పరుగులు చేసి అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మైలురాయి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆమె రెండో స్థానంలో నిలవగా, ఎడ్వర్డ్స్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని