వ్యాక్సిన్ తీసుకున్న భారత మహిళా క్రికెటర్లు - indian women’s cricket team gets first dose of covid-19 vaccine
close
Published : 28/05/2021 22:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్ తీసుకున్న భారత మహిళా క్రికెటర్లు

photo:(BCCI Women Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్న భారత మహిళా క్రికెటర్లు  కొవిడ్-19 తొలి డోసు టీకాను తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘మహిళల జట్టులోని క్రికెటర్లందరికీ కొవిడ్- 19 తొలి డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఇందులో ముందుగానే చాలామంది తమ సొంత నగరాల్లోనే టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోకుండా మిగిలిన వారు గురువారం తీసుకున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 

వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ఫొటోను ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ట్విటర్‌లో పోస్టూ..‘నాకు సూది అంటే కాస్త భయం. అయినా కూడా ఈ రోజు నేను టీకా తీసుకున్నాను. ప్రజలందరూ వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరుతున్నా’ అనే వ్యాఖ్యను జతచేసింది. 

ఇక, రెండో డోసును ఇంగ్లాండ్‌లో భారత పురుషుల జట్టుతోపాటు మహిళల జట్టు కూడా తీసుకోనుంది. ప్రస్తుతం రెండు జట్ల క్రికెటర్లు ముంబయిలో గ్రాండ్  హయత్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య ఈ మ్యాచ్‌ జరగనుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. మహిళల జట్టు అతిథ్య జట్టుతో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని