CovidVaccine: 100 రోజుల్లో 14.19 కోట్ల మందికి.. - indias cumulative vaccination coverage exceeds 14.19 crore in 100 days
close
Published : 26/04/2021 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CovidVaccine: 100 రోజుల్లో 14.19 కోట్ల మందికి..

దిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలై ఆదివారం నాటికి 100 రోజులు పూర్తయ్యింది. ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 14.19 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కాగా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరి 16న ప్రారంభించారు. ఇప్పటి వరకూ  20,44,954 సెషన్స్‌లో 14,19,11,233 మందికి టీకా అందించారు. మొత్తం వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 58.78 శాతం కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలలో జరిగింది.

కొత్తగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే దేశంలోని మొత్తంలో 74.5 శాతం మాహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌ల నుంచే ఉంటున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,52,991 కేసులు నమోదు కాగా, 2,812 మరణాలు సంభవించాయి. దీంతో క్రియాశీల కేసులు 28,12,658కు చేరాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని