షకలక శంకర్‌ ‘లాయర్‌ సాబ్‌’ ట్రైలర్‌ చూశారా? - indias first ever cover trailer shakalaka shankar lawyer saab
close
Published : 04/04/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షకలక శంకర్‌ ‘లాయర్‌ సాబ్‌’ ట్రైలర్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ యూట్యూబ్‌ వేదికగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ‘లాయర్‌సాబ్‌’ పేరుతో కవర్‌ ట్రైలర్‌ తీర్చిదిద్దారు నటుడు షకలక శంకర్‌. ఆయన కీలక పాత్రలో ట్రైలర్‌లోని సన్నివేశాలను రీ క్రియేట్‌ చేశారు.

ఆద్యంతం నవ్వులు పంచేలా ఉన్న ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే దీన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ‘ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ అమ్మది. అమ్మ తర్వాత అంతటి స్వచ్ఛమైన ప్రేమ అభిమానులదేరా? ఒక్కసారి హీరోని ఇష్టపడితే, ఆ హీరో హిట్‌ల్లో ఉన్నా, ఫ్లాఫ్‌ల్లో ఉన్నా.. తెరమీద ఉన్నా, తెరవెనుకాల ఉన్నా.. చచ్చేవరకూ గుండెల్లో పెట్టుకుని పూజించేవారే అభిమానులంటే’ అంటూ పలికే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని