ఐరాస సేవలకు.. బహుమతిగా భారత్‌ టీకా! - indias gift of 2 lakh covid vaccine doses will be sent to un peacekeepers on march 27
close
Published : 26/03/2021 23:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐరాస సేవలకు.. బహుమతిగా భారత్‌ టీకా!

న్యూయార్క్‌: భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్‌లను ఇప్పటికే ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నారు. ప్రపంచలోనే అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా విదేశాలకు టీకా సరఫరా చేయడంలో భారత్‌ గణనీయమైన ఖ్యాతిని సాధించింది. కాగా, ఐక్యరాజ్యసమితి సిబ్బంది(యూఎన్‌ పీస్‌కీపర్స్‌)కి బహుమతిగా ప్రకటించిన 2 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను మార్చి 27న తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. యూఎన్‌ పీస్‌కీపర్స్‌ సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ టీకా డోసులను అందించనున్నట్లు ఫిబ్రవరిలో యూఎన్‌ భద్రతామండలిలో జరిగిన సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌ చెప్పారు.

యూఎన్‌ శాంతిభద్రతల విభాగంలో 121 దేశాలకు భాగస్వామ్యం ఉండగా, 2021 జనవరి 21 నాటికి 85,782 మంది సేవలందిస్తున్నట్లు ప్రభుత్వం గణాంకాలు వెల్లడించింది. ఈ సిబ్బందిలో అధిక భాగం భారత్‌లోనే ఉన్నారని వివరించింది. ఈ క్రమంలో వారి సేవలకు గుర్తుగా దేశీయ ఆస్ట్రాజెనెకా టీకాను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. శనివారం ముంబయి నుంచి ఖతార్‌ ఏయిర్‌వే ద్వారా టీకా డోసులను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. విదేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయడంలో భారత్‌ గొప్ప ఘనత సాధించిందని, దీంతో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీ సంస్థగా రూపొందిందని యూఎన్‌ జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్‌ గతంలో ప్రశంసించిన విషయం తెలిసిందే..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని