
తాజా వార్తలు
ప్రియుడి కోసం కియారా కష్టాలు..!
వినోదాత్మకంగా ‘ఇందూ కీ జవానీ’ ట్రైలర్
ముంబయి: కథానాయిక కియారా అడ్వాణీ తనను నిజంగా ప్రేమించే అబ్బాయి కోసం తెగ గాలిస్తున్నారు. అందు కోసం డేటింగ్ యాప్‌లో సర్చ్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఆమె నటించిన సినిమా ‘ఇందూ కీ జవానీ’. అభిర్ సేన్‌గుప్తా దర్శకుడు. ఆదిత్య సీల్ కథానాయకుడు. టీ సిరీస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సోమవారం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ను కియారా షేర్ చేశారు. ఆమె ‘ఇందు’ పాత్రలో పక్కింటి అమ్మాయిలా కనిపించారు. ప్రేమించే వ్యక్తి కోసం తెగ వెతుకుతుంటారు. ఈ క్రమంలో స్నేహితుల సలహాతో డేటింగ్ యాప్ వాడటం మొదలుపెడతారు. పాకిస్తాన్‌కు చెందిన యువకుడి పరిచయంతో ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. అతడ్ని ఉగ్రవాదిగా భావించి, మాట్లాడే సన్నివేశాలు సరదాగా అనిపించారు. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.