Team India: కోహ్లీసేన డ్రైవ్‌ చేస్తే దొరికేసినట్టే! - indvseng dont play big drives in england suggests veng sarkar
close
Updated : 05/06/2021 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Team India: కోహ్లీసేన డ్రైవ్‌ చేస్తే దొరికేసినట్టే!

ఇంగ్లాండ్‌లో బంతిని పుష్‌ చేయాలన్న వెంగీ

ముంబయి: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్‌ఇండియాకు మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ కొన్ని సూచనలు చేశారు. అక్కడ బంతి ఎక్కువ స్వింగ్‌ అవుతుంది కాబట్టి భారీ డ్రైవ్‌లు ఆడొద్దన్నారు. కేవలం ముందుకు నెట్టాలని సూచించారు. ఆ దేశంలో ఒకే రోజు రకరకాల వాతావరణం ఉంటుందని వివరించారు. అక్కడ నిలదొక్కుకోవడం కష్టమని తెలిపారు.

‘మేం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లాండ్‌లో పర్యటించేటప్పుడు పక్కన కౌంటీ మ్యాచులు ఆడేవాళ్లం. దాంతో అక్కడి వాతావరణానికి బాగా అలవాటు పడేవాళ్లం. అక్కడి అదనపు స్వింగ్‌ను ప్రత్యేకించి ఆఫ్‌ వికెట్‌పై ఎదుర్కోవాలంటే సైడ్‌ ఆన్‌ బ్యాటింగ్‌ స్టాన్స్‌ తీసుకోవడం ముఖ్యం’ అని దిలీప్‌ తెలిపారు.

‘ఆరంభంలోనే అక్కడ భారీ డ్రైవ్స్‌ ఆడొద్దు. ఎందుకంటే బంతి పక్కకు దూసుకెళ్తుంది. హాఫ్‌ వ్యాలీ చూడగానే భారీ డ్రైవ్‌ చేయాలనుకుంటే స్లిప్‌లో చిక్కే అవకాశం ఉంటుంది. అందుకే డ్రైవ్‌ ఆడటం బదులు బంతిని పుష్‌ చేస్తే మంచిది. ఇంగ్లాండ్‌లో ఆకాశం అప్పటికప్పుడు మబ్బులు పట్టేస్తుంది. హఠాత్తుగా ఎండ కాసి బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది’ అని వెంగీ పేర్కొన్నారు.

ఇంగ్లాండ్‌లో ఒకే రోజు రకరకాల రుతువులు కనిపిస్తాయని వెంగ్‌సర్కార్‌ తెలిపారు. దాంతో బ్యాట్స్‌మెన్‌ నిలదొక్కుకోలేరని అన్నారు. అదే భారత్‌లో అయితే 30 పరుగులు చేస్తే భారీ ఇన్నింగ్స్‌ ఆడొచ్చని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో నిలదొక్కుకోవాలంటే సన్నాహక మ్యాచులు ఆడటం ఎంతో కీలకమని వెల్లడించారు. మ్యాచ్ మధ్యలో నిలదొక్కుకొని ఆడితే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని