శ్రేయస్‌ ఒక్కడే: ఇంగ్లాండ్‌ లక్ష్యం 125 - indvseng india set target of 125 to england
close
Published : 12/03/2021 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రేయస్‌ ఒక్కడే: ఇంగ్లాండ్‌ లక్ష్యం 125

పేస్‌తో వణికించిన ఇంగ్లిష్‌ పేసర్లు

అహ్మదాబాద్‌: మొతేరా మోత మోగుతుందనుకుంటే మూగబోయింది! ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్‌ఇండియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. ఇంగ్లిష్‌ పేసర్ల ధాటికి కోహ్లీసేన విలవిల్లాడింది. శ్రేయస్‌ అయ్యర్‌ (67; 48 బంతుల్లో 8×4, 1×6) మాత్రమే అర్ధశతకంతో రాణించాడు. ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు.

రిషభ్ పంత్‌ (21; 23 బంతుల్లో 2×4, 1×6) కాసేపు అలరించాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌తో సిక్సర్‌ బాది అదరగొట్టాడు. హార్దిక్‌ పాండ్య (19; 21 బంతుల్లో 1×4, 1×6) సైతం కొంత సమయం అయ్యర్‌కు అండగా నిలిచాడు. ఇంగ్లాండ్ ఐదుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ను ప్రయోగించింది. ఆర్చర్‌ 3 వికెట్లు తీశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని