‘ఐఎన్‌జీ’ ఓ విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ : అల్లు అరవింద్‌ - ing is a different kind of crime thriller says allu aravind
close
Published : 19/05/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఐఎన్‌జీ’ ఓ విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ : అల్లు అరవింద్‌

ప్రియదర్శి, నందినీ రాయ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ (ఐఎన్‌జీ) పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. విద్యాసాగర్‌ ముత్తుకుమార్‌  దర్శకుడు. భాషా, ప్రేమ, మాస్టర్‌ చిత్రాల దర్శకుడు సురేష్‌ కృష్ణ ఈ సిరీస్‌ను నిర్మించారు. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘90ల్లో సురేష్‌ ‘భాషా’ చిత్రం చూసి ఆశ్చర్యపోయా. అప్పుడే ఆయనతో పని చేయాలని నిర్ణయించుకున్నా. చివరకు ఆయన మా బ్యానర్‌లో ‘మాస్టర్‌’, ‘డాడి’ సినిమాలు చేశారు. ఇటీవల ఆయనకు ఫోన్‌ చేసి ‘ఆహా’ కోసం ఏదైనా చేయమని కోరా. అప్పుడే ఈ వెబ్‌సిరీస్‌తో ముందుకొచ్చారు. విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెర   కెక్కింది. ఈ సిరీస్‌లో ప్రియదర్శి చాలా కొత్తగా కనిపిస్తాడు. నేను రెండు ఎపిసోడ్స్‌ చూశా. దర్శి నటన, నందనీ రాయ్‌ గ్లామర్‌ ఆకట్టుకున్నాయి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా పని చేసిన నాకు ఈ జర్నీ చాలా కొత్తగా అనిపించింది. అన్ని ఎలిమెంట్స్‌తో మంచి ప్యాకేజీలా ఈ సిరీస్‌ సాగుతుంద’’న్నారు సురేష్‌ కృష్ణ. ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘ఆహా’లో విడుదలైన ‘మెయిల్‌’లో హైబత్‌ అనే మంచి పాత్ర చేశా. ఇప్పుడిందులో ఇంత వరకు చేయని ఓ సరికొత్త పాత్ర చేశా. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి’’ అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని