బుడగ వీడిన శ్రేయస్‌: త్వరలో శస్త్రచికిత్స! - injured iyer exits bio-secure bubble says will be back soon stronger iyer
close
Published : 25/03/2021 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుడగ వీడిన శ్రేయస్‌: త్వరలో శస్త్రచికిత్స!

పుణె: గాయపడ్డ యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ బయో బుడగను వీడాడు. శస్త్రచికిత్స చేయించుకొనేందుకు ఆస్పత్రిలో చేరనున్నాడు. కాగా తాను మరింత బలం పుంజుకొని తిరిగొస్తానని అయ్యర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడు డైవ్‌ చేశాడు. ఈ క్రమంలో నేలపై బలంగా పడటంతో అతడి ఎడమభుజం స్థానభ్రంశమైంది. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని ఫిజియో పరీక్షించి డ్రస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లాడు. స్కానింగ్‌ తీసిన తర్వాత గాయం తీవ్రత తెలిసింది. దాంతో అతడు సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌ ప్రథమార్ధానికీ అతడు అందుబాటులో ఉండడని సమాచారం.

‘శ్రేయస్‌ అయ్యర్‌ బయో బడుగను వీడాడు’ అని బీసీసీఐ గురువారం తెలిపింది. అయితే తాను మరింత బలంగా పునరాగమనం చేస్తానని అయ్యర్‌ అంతకు ముందు ధీమా వ్యక్తం చేశాడు. ‘ఎంత ఎక్కువ కష్టం ఉంటే అంత బలంగా పుంజుకుంటామని పెద్దలు చెబుతుంటారు. త్వరలోనే నేను తిరిగొస్తాను. మీ సందేశాలు చదివాను. మీ ప్రేమ, ఆప్యాయతలకు నేనెంతో సంతోషిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అయ్యర్‌ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందే అతడు లాంకాషైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని