నాని, రీతూవర్మ.. ఓ ప్రేమగీతం - inkosaariinkosaari​ lyrical
close
Updated : 13/02/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని, రీతూవర్మ.. ఓ ప్రేమగీతం

‘టక్‌ జగదీశ్‌’ ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ‘నిన్నుకోరి’ తర్వాత నేచురల్‌స్టార్‌ నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతోన్న సూపర్‌హిట్‌ చిత్రం ‘టక్‌ జగదీశ్‌’. రీతూవర్మ కథానాయిక. ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ చిరుకానుక బయటకు వచ్చింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఈ చిత్రం నుంచి మొదటి పాటను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘ఇంకోసారి ఇంకోసారి’ అంటూ సాగే ఈ పాటను శ్రేయాఘోషల్‌, కాళభైరవ ఆలపించారు. తమన్‌ స్వరాలు అందించిన ఈ మెలోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.

షైన్‌ స్ర్కీన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ రెండో హీరోయిన్‌ పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇదీ చదవండి

బిగ్‌న్యూస్‌: రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబో ఫిక్స్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని