ఐనాక్స్‌ ఆఫర్‌: థియేటర్‌ మొత్తం బుక్‌ చేసుకోండి - inox offering entire cinema hall to rent at low prize
close
Published : 04/11/2020 00:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐనాక్స్‌ ఆఫర్‌: థియేటర్‌ మొత్తం బుక్‌ చేసుకోండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా గత ఏడు నెలలుగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతిచ్చినా.. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. సినిమా చూసేందుకు అనేక మంది వస్తుంటారు.. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే తమకు ఎక్కడ అంటుకుంటుందోనన్న భయమే ఇందుకు కారణం. థియేటర్లను శానిటైజ్‌ చేసి, కరోనా నిబంధనలు పాటిస్తున్నా ప్రేక్షకుల రాకపై అనుమానంతో థియేటర్లను తెరిచేందుకు యాజమాన్యాలు వెనకడుగువేస్తున్నాయి. కానీ, ప్రముఖ మల్టీప్లెక్స్‌ థియేటర్ల చైన్‌ సంస్థ ఐనాక్స్‌ సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం ఇటీవల బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తక్కువ ధరకే ప్రైవేటు స్క్రీనింగ్‌ వేయనున్నట్లు తెలిపింది. 

ఐనాక్స్‌ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మల్టీపెక్స్‌ థియేటర్లు ఉన్నాయి. ఆయా థియేటర్లలో ప్రేక్షకుల కోసం ప్రైవేటు స్క్రీనింగ్‌ ఏర్పాట్లు చేసింది. ఎవరైనా సరే మొత్తంగా బుక్‌ చేసుకొని కేవలం కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో మాత్రమే జాలీగా.. కరోనా భయం లేకుండా సినిమా చూసే విధంగా సంస్థ ప్రత్యేక ఆఫర్‌ ఇస్తోంది. ఇందుకు గానూ కేవలం రూ. 2,999 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. థియేటర్‌ బుక్‌ చేసుకోవాలంటే కనిష్ఠంగా ఇద్దరు.. గరిష్టంగా థియేటర్‌ సీట్ల సామర్థ్యంలో 50శాతం మంది ఉండాలని సూచిస్తోంది. థియేటర్‌ బుక్‌ చేసుకున్న వారి అభీష్టం మేరకు కొత్త, పాత ఏ సినిమానైనా యాజమాన్యం ప్రదర్శిస్తుందని వెల్లడించింది. గతంలోనే ఇలాంటి ప్రైవేటు స్క్రీనింగ్‌ సదుపాయాల్ని పలు మల్టీపెక్స్‌లు ప్రారంభించాయి. కానీ, బుకింగ్‌ ధర చాలా ఖరీదుగా ఉండేది. ప్రస్తుతం ఐనాక్స్‌ అందరికీ అందుబాటు ధరలో ఈ సౌలభ్యాన్ని కల్పించడం విశేషం. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎప్పటికప్పుడు థియేటర్లను శానిటైజ్‌ చేస్తున్నట్లు ఐనాక్స్‌ పేర్కొంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని