‘ఆచార్య’ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ లీక్‌ - interesting leak from chiru acharya movie
close
Published : 20/03/2021 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ లీక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈమధ్య అగ్రకథానాయకుడు చిరంజీవి మైక్‌ పట్టుకుంటే చాలు.. తన తర్వాతి సినిమా గురించి ఏదో ఒక ఆసక్తికరమైన వార్త చెబుతారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఓ సినిమా వేడుకలో చిరు మాట్లాడుతూ.. కొరటాలతో చేస్తున్న సినిమా ‘ఆచార్య’ అంటూ టైటిల్‌ను చెప్పేసి నాలిక్కరుచుకున్న సంఘటన గుర్తుందిగా.! అప్పటి నుంచి ఆయన ఎప్పుడు స్టేజి ఎక్కినా తనను తాను నియంత్రించుకుంటూ ఆచితూచి మాట్లాడుతున్నారు. అయితే.. మరోసారి అనుకోకుండా మరో లీక్‌ చేసేశారాయన. ఈసారి ఏకంగా.. ‘ఆచార్య’ స్టోరీలైన్‌ను బయటికి చెప్పేశారు.

రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాటపర్వం’ సినిమా టీజర్‌ను చిరంజీవి శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘విరాటపర్వం’ టీజర్‌ చాలా బాగా నచ్చింది. టీజర్‌ చూస్తుంటే నక్సల్‌ బ్యాక్‌డ్రాప్‌ అని తెలుస్తోంది. నాకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే.. తర్వాత రాబోయే నా ‘ఆచార్య’ సినిమా కూడా నక్సల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న సినిమానే. ‘నాదొక వినూత్నమైన చిత్రం.. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రాలేద’ని అనుకుంటున్న క్రమంలో ఈ సినిమా వచ్చింది. నాకంటే ముందే ఈ సినిమా విడుదలవుతుంది కాబట్టి ఈ సినిమాకు మంచి పేరు వస్తే.. నాకు సంతోషం. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. డైరెక్టర్‌ వేణు ఊడుగులకు మంచి పేరు రావాలి. భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్‌ కావాలి’ అని ఆయన పేర్కొన్నారు. కట్‌ చేస్తే.. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘ఆచార్య’ కథ లీక్‌ అయిపోయింది. ఇంకేముంది.. మెగాస్టార్‌ మరోసారి చెప్పేశారంటూ.. సోషల్‌ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు.

చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌, చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి తెరపై కనిపించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని