close
Published : 08/03/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శాకుంతలం: దేవ్‌ మోహన్‌ ఎవరో తెలుసా..?

రెండో సినిమాకే భారీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌ కొట్టేసిన హీరో

హైదరాబాద్‌: మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి.. నటనపై ఉన్న ఆసక్తితో అనతి కాలంలోనే నటుడిగా  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు దేవ్‌ మోహన్‌. ఆదితిరావు హైదరీ కథానాయికగా నటించిన ‘సూఫీయుం సుజాతయుం’ అనే ప్రేమకథతో దేవ్‌ కథానాయకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఫీల్‌గుడ్ నటన వల్ల మొదటి సినిమాతోనే ఎంతో మంది మలయాళీ అభిమానుల్ని ఆయన సొంతం చేసుకున్నారు. అయితే దేవ్‌ కేవలం నటుడు మాత్రమే కాదు.. గాయకుడు కూడా. ‘సూఫీయుం సుజాతయుం’ సినిమా కోసం ఆయన మొదటిసారి గొంతు సవరించుకున్నారు.

‘శాకుంతలం’ కోసం దేవ్‌ మోహన్‌ను ఎంచుకోవడం గురించి గుణశేఖర్‌ స్పందిస్తూ.. ‘‘శాకుంతలం’ కథ అనుకున్నప్పుడే దుష్యంతుడి పాత్ర కోసం ఎలాంటి ఫేమ్‌ లేని ఓ కొత్త నటుడ్ని టీమ్‌లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే అతను అందంగా, చూపరుల్ని ఆకర్షించే విధంగా ఉండాలనుకున్నాను.  అలాంటి సమయంలో దేవ్‌ మోహన్‌ని చూశా. దేవ్‌ కేవలం మోడల్‌ మాత్రమే కాదు మిస్టర్‌ ఇండియా పోటీదారుడు, మంచి నటుడు. దుష్యంతుడి పాత్ర కోసం అతను ఎంతో శ్రమిస్తున్నాడు. ఇప్పటికే గుర్రపుస్వారీ, ఫిట్‌నెస్‌లో శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం అతను తెలుగు నేర్చుకుంటున్నాడు.’’ అని గుణశేఖర్‌ వివరించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని