‘పాస్‌పోర్ట్‌ పత్రిక’తో పెళ్లికి ఆహ్వానం - invitation to a wedding with a passport
close
Updated : 21/02/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పాస్‌పోర్ట్‌ పత్రిక’తో పెళ్లికి ఆహ్వానం

 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  పెళ్లి కోసం శుభలేఖలతో ఆహ్వానం పలుకుతుంటాం. సాధారణంగా అవి దేవుళ్ల బొమ్మలతో ఉంటాయి. కానీ పాస్‌పోర్ట్‌లాగా శుభలేఖలు తయారు చేసి ఉండటాన్ని ఎప్పుడైనా చూశారా? కర్ణాటకలోని అనగుల్‌ చెందిన ధర్మరాజ అనే యువకుడు.. పాస్‌పోర్టును పోలినట్లు ఉండే శుభలేఖను తయారు చేయించి, బంధువులకు స్నేహితులకు తన పెళ్లికి ఆహ్వానం పలికాడు. ‘‘మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇప్పటికే ఆధార్, పాన్‌కార్డ్‌ వంటి మోడల్స్‌లో శుభలేఖలొచ్చాయి. ఏదైనా కొత్తగా చేయాలనుకుని ఆలోచించాం.  బోర్డింగ్‌ పాస్, పాస్‌పోర్ట్, టికెట్‌ మోడల్‌తో ఆహ్వాన పత్రిక తయారు చేయించాం’’అని వరుడు ధర్మరాజ తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని