మళ్లీ ముంబయికే IPL? - ipl again shifting to mumbai
close
Updated : 04/05/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ ముంబయికే IPL?

బెంగళూరు, కోల్‌కతా వెళ్లేందుకు ఆటగాళ్ల నిరాకరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మళ్లీ ముంబయి బాట పట్టనుంది! అహ్మదాబాద్‌, దిల్లీలో బయో బుడగ బద్దలవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఉన్నపళంగా అక్కడి సామగ్రిని ఇతర వసతులను ముంబయికి తరలించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం, క్రీడాశాఖ మంత్రి, ఇతర అధికారులను సంప్రదించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా నగరంలోని హోటళ్లకు ఫోన్లు చేసి బస గురించి ఆరాతీసిందని ఐపీఎల్‌ వర్గాలు అంటున్నాయి.

ఈ ఐపీఎల్‌ సీజన్లో మొదటి లీగ్‌ ముంబయి, చెన్నైలో విజయవంతంగా నిర్వహించారు. అక్కడ బయోబుడగలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. రెండో దశ వేదికలు అహ్మదాబాద్‌, దిల్లీ కావడంతో జట్లన్నీ అక్కడికి వెళ్లాయి. అయితే కోల్‌కతా ఆటగాళ్లు సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తి, చెన్నై బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, దిల్లీ మైదానం సిబ్బందికి కొవిడ్‌ రావడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా సోమవారం నాటి కోల్‌కతా, బెంగళూరు మ్యాచును వాయిదా వేశారు. మంగళవారం జరిగే మ్యాచుపైనా సందిగ్ధం నెలకొంది.

ఈ నేపథ్యంలో తర్వాతి వేదికలైన బెంగళూరు, కోల్‌కతాకు వెళ్లేందుకు ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు నిరాకరిస్తున్నారని తెలిసింది. దాంతో ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్‌ స్టేడియంలో మ్యాచులను నిర్వహించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. సోమవారం ముంబయిలోని స్టార్‌ హోటళ్లను బోర్డు వర్గాలు సంప్రదించాయట. మొత్తంగా మే 7లోపు వసతులు, సామగ్రిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన  బోర్డు పనిచేస్తోంది. ఆలోపు జరిగే మ్యాచులను రీషెడ్యూలు చేయనుందని తెలిసింది. రోజుకు ఒక్కటి కాకుండా రెండు మ్యాచులు నిర్వహించాలని నిర్ణయించిందట. అలాకాకుండా లీగ్‌ను జూన్‌ వరకు పొడగించాలని ప్రసారదారు కోరుతోందని అంటున్నారు. మంగళవారం సాయంత్రానికి కొంత స్పష్టత రావొచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని