వ్యాక్సిన్ల కొరత అంటుంటే.. టీకా ఉత్సవమా?  - is it right to export vaccines put countrymen at risk asks rahul gandhi
close
Updated : 09/04/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్ల కొరత అంటుంటే.. టీకా ఉత్సవమా? 

ప్రధానిపై రాహుల్‌ గాంధీ ధ్వజం

దిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న వేళ దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్‌ టీకాలను ఎగుమతి చేయడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఓ వైపు వ్యాక్సిన్ల కొరత ఉందని రాష్ట్రాలు చెబుతుంటే ప్రధాని మోదీ మాత్రం టీకా ఉత్సవం జరపాలంటున్నారని ధ్వజమెత్తారు.

‘‘కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల కొరత అనేది చాలా తీవ్రమైన సమస్య. అంతేగానీ ఉత్సవం కాదు. దేశ ప్రజలను ప్రమాదంలో ఉంచి టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సరైందేనా? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపించకుండా అన్ని రాష్ట్రాలకు సత్వర సాయం అందించాలి. ఈ మహమ్మారిపై మనమంతా కలిసికట్టుగా పోరాడి కరోనాను ఓడించాలి’’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే అదేమీ లేదని, కొందరు కావాలనే టీకాలపై రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దుయ్యబట్టింది. మరోవైపు కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఈ నెల 11-14 తేదీల మధ్య వ్యాక్సిన్‌ ఉత్సవం నిర్వహించి.. అర్హులైన వారందరికీ టీకాలు అందించాలని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని