‘చౌడప్పనాయుడు’గా ఎన్టీయార్‌‌..? - is ntr next movie titled as chowdappa naidu
close
Published : 11/01/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చౌడప్పనాయుడు’గా ఎన్టీయార్‌‌..?

హైదరాబాద్‌: పెద్ద హీరోల సినిమాలు ప్రకటించడమే ఆలస్యం.. టైటిల్‌ నుంచి మొదలుపెట్టి నటీనటులు.. కథ.. క్లైమాక్స్‌ ఇలా అన్ని విషయాల్లోనూ ఏవేవో ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. ఎన్టీయార్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పరిస్థితి కూడా ఇలాంటిదే. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీయార్‌ తర్వాతి చిత్రం త్రివిక్రమ్‌తో కలిసి చేయనున్నారు. అయితే.. వీళ్ల కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తప్పితే ఎలాంటి వివరాలను చిత్రబృందం ప్రకటించలేదు. అయితే.. ఆ మధ్య ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అదే ‘చౌడప్పనాయుడు’. ఈ టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోందని ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే దర్శకనిర్మాతల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

ఈ సినిమాకు సంబంధించిన పనులు తర్వలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణలో ఉన్నారు తారక్‌. ఆ సినిమా పూర్తవగానే త్రివిక్రమ్‌తో కలిసి పని ప్రారంభించనున్నారట. కాగా.. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ‘ఎన్టీఆర్‌30.. త్వరలోనే పట్టాలెక్కబోతోంది’ అంటూ కొత్త సంవత్సర సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గతంలో తారక్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ విజయం సాధించింది. కాగా మరోసారి ఈ ఇద్దరూ కలిసి అలరించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదీ చదవండి

ఫీల్‌ మిస్‌ కాకుండా రాయడం కత్తిమీద సాముమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని