రామ్‌చరణ్‌ ఆ దర్శకుడికి ‘ఛలో’ అన్నాడా? - is ramcharan next film with nithin director
close
Published : 21/07/2020 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌చరణ్‌ ఆ దర్శకుడికి ‘ఛలో’ అన్నాడా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా - లాక్‌డౌన్‌తో అందరూ స్టక్‌ అయిపోతే... సినిమా తారలు కొత్త సినిమాలతో ఫిక్స్‌ అవుతున్నారు. కొత్త కథలు వినడం, తర్వాత సినిమాల గురించి మేకోవర్‌ల గురించి ఆలోచించడం లాంటివి చేస్తున్నారు. అలా రామ్‌చరణ్‌ తన తర్వాతి సినిమాను ఓకే చేసుకున్నాడని తెలుస్తోంది. ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాల విజయాలతో జోరు మీదున్న వెంకీ కుడుముల సినిమాకు చరణ్‌ ఓకే చెప్పాడని టాలీవుడ్‌ భోగట్టా. 

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ ఏ సినిమా చేస్తాడు అంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రశ్నలకు వెంకీ కుడుముల సినిమాతో ఫుల్‌స్టాప్ పడినట్లే అని తెలుస్తోంది. వెంకీ చెప్పిన కథ రామ్‌చరణ్‌కు బాగా నచ్చిందని టాక్‌. తన స్నేహితుల యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాల్లో తనదైన శైలిలో వినోదాన్ని రంగరించిన వెంకీ కుడుముల, చంణ్‌ సినిమా కోసం అదే పనిలో ఉన్నాడు. ఇందులో ప్రేమ పాళ్లు కూడా బాగానే కలుపుతున్నాడనీ అంటున్నారు. 

యూవీ క్రియేషన్స్‌లో సినిమా చేయాలని చరణ్‌ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమాతో ఇన్నాళ్లకు కుదిరిందన్నమాట. మరోవైపు చరణ్‌ నుంచి ప్రేమకథ వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమాతో చరణ్‌ అభిమానుల ముచ్చట తీరుస్తాడేమో చూడాలి. అన్నట్లు విజయదశమి సందర్భంగా ఈ సినిమా మొదలుపెడతారని తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని