సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఎమోజీ చూశారా! - is samantha akkineni first indian female actor to get twitter emoji
close
Updated : 23/01/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఎమోజీ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి సమంత తొలిసారి నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌- 2’. మనోజ్‌బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్ప్రైమ్‌లో ప్రసారమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌కు ఇది కొనసాగింపు. ఇటీవల వచ్చిన టీజర్‌లో సమంత లుక్‌ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ ఒక ట్విటర్‌ ఎమోజీని విడుదల చేసింది. ఇందులో మనోజ్‌ బాజ్‌పాయ్‌తో పాటు సమంత కూడా కనిపిస్తుండటం విశేషం. ఈ తరహా ఎమోజీని దక్కించుకున్న భారతీయ మహిళా నటుల్లో సమంతనే ప్రథమం.

ఇదే విషయాన్ని సమంత ట్విటర్‌లో.. నిజంగానా అంటూ నవ్వుతున్న ఎమోజీలను ఉంచింది. సైనికులు ధరించే యూనిఫాంతో సమంత సెల్యూట్‌ చేస్తునట్టు ఆ ఎమోజీ దర్శనమిస్తోంది. ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మాన్‌-2’హ్యష్‌టాగ్‌ సోషల్‌మీడియాలో ట్రెండవుతోంది. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించి ట్రైలర్‌ను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ విడుదల చేయనుంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌తో పాటు ప్రియమణి ప్రధానపాత్రలో యాక్షన్‌, స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే!

ఇవీ చదవండి!

ఆ హీరోతో నాకో డీల్‌ ఉంది: రకుల్‌

అందరినీ నవ్విస్తాడు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని