క్రిష్‌-వైష్ణవ్‌ మూవీ.. టైటిల్‌ అదేనా? - is this the title of krish and vaishnav movie
close
Published : 01/03/2021 10:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిష్‌-వైష్ణవ్‌ మూవీ.. టైటిల్‌ అదేనా?

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు క్రిష్‌, కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అంశం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘జంగిల్‌బుక్’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానాలు, వారి కష్టసుఖాలు తెలియజేస్తూ వచ్చిన ఓ నవలను ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు క్రిష్‌ ఓ సందర్భంలో తెలిపారు. వైష్ణవ్ ‌తేజ్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సందడి చేయనున్నారు. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా రానున్న చిత్రమిదే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని