‘ఇష్క్‌’ సినిమా విడుదల వాయిదా - ishq movie release postponed
close
Updated : 21/04/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఇష్క్‌’ సినిమా విడుదల వాయిదా

 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  తేజ సజ్జ, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’(Not a Love Story)అనేది ఉపశీర్షిక. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వస్తోన్న ఈ  చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజు  దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలోనే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తేజ ట్వీటర్‌ వేదికగా ప్రకటించారు. వాస్తవానికి ఏప్రిల్‌ 23న చిత్రం విడుదలకావాల్సివుంది.. వచ్చే రెండు వారాలు కరోనా చాలా తీవ్రంగా ఉండనుందని, ఇలాంటి సమయంలో సినిమాని విడుదల చేయడం మంచిది కాదు. త్వరలోనే సినిమాకి సంబంధించి కొత్త విడుదల తేదీతో మీ ముందుకు వస్తాం. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి ఇంట్లోనే క్షేమంగా ఉండాలని సూచించింది. అంతేకాదు కరోనా బారిన పడిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఇతర బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని తెలిపారు. ‘ఇష్క్’సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాట ఆకట్టుకుంటున్నాయి. ఆర్‌.బి.చౌదరి సమర్పణలో చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు.   
 

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని