థియేటర్లలోనే ‘ఇష్క్‌’.. విడుదల అప్పుడే.. - ishq not a love story only in cinemas from july 30
close
Published : 20/07/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటర్లలోనే ‘ఇష్క్‌’.. విడుదల అప్పుడే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. పెద్ద తెరమీద సినిమా మాజాను ఆస్వాదించాలనుకునే సినీప్రేమికుల కల మళ్లీ నెరవేరబోతోంది. ఒక్కొక్కటిగా సినిమాలు థియటర్‌ విడుదలకు మొగ్గు చూపుతున్నాయి. తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన ‘ఇష్క్‌’ను థియేటర్‌లోనే విడుదల చేస్తామని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. జూలై 30 ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇటీవల ‘జాంబీరెడ్డి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాను ఎస్.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆర్‌.బి.చౌదరి సమర్పణలో ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని