ఇష్క్‌.. ఇది ప్రేమకథ కాదు - ishq trailer out now
close
Published : 15/04/2021 11:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇష్క్‌.. ఇది ప్రేమకథ కాదు

ఆకట్టుకునేలా ట్రైలర్‌

హైదరాబాద్‌: తేజ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇష్క్‌’ (నాట్‌ ఏ లవ్‌ స్టోరీ). ఎస్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఇష్క్‌’ (నాట్‌ ఏ లవ్‌ స్టోరీ) ట్రైలర్‌ను నటుడు సాయిధరమ్‌ తేజ్‌ సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ప్రేమకథతోపాటు సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. తేజ, ప్రియా ప్రకాశ్‌ వారియర్ల నటన, డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి మహతి స్వరా సాగర్‌ స్వరాలు అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని