మురుగదాస్‌ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హీరో!? - ismart shankar ram directed by murugadoss
close
Updated : 04/06/2021 09:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మురుగదాస్‌ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హీరో!?

ఇంటర్నెట్‌ డెస్క్: ‘గజిని’, ‘స్టాలిన్‌’, ‘7th సెన్స్’ ,‘స్పైడర్‌’, ‘దర్బార్‌’లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు మురుగదాస్‌. తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. త్వరలోనే ఆయన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హీరో రామ్‌ పోతినేనితో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మురుగదాస్‌, రామ్‌ని కలిసి కథను కూడా వినిపించాడట. అతనికి కథ నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. రామ్ ఇప్పటికే మరో తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. మాధవన్‌ ప్రతినాయకుడిగా నటించనున్నారట. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకంపై ఆ చిత్రం నిర్మితమవుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఇందులో రామ్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారట. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు - తమిళంలో తెరకెక్కనుంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని