Experiment: మనిషి ఆయుర్దాయం 120 ఏళ్లు కానుందా? - israel scientists extended 23 percent life expectancy of mice
close
Published : 03/06/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Experiment: మనిషి ఆయుర్దాయం 120 ఏళ్లు కానుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషి ఆయుర్దాయాన్ని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఒక పరిశోధనలో భాగంగా ఎలుకలపై ప్రయోగం చేసి, వాటి ఆయుర్దాయాన్ని 23 శాతం పెంచినట్లు ‘నేచర్‌ కమ్యూనికేషన్‌’ అనే జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. 

శాస్త్రవేత్తలు 250 ఎలుకలపై ఈ ప్రయోగం జరిపారు. వయసుకు సంబంధించిన సర్టియిన్‌-6(ఎస్‌ఐఆర్‌టీ-6) అనే ప్రొటిన్‌ను ఎలుకల్లోకి ఎక్కువ మొత్తంలో ప్రవేశపెట్టడంతో వృద్ధాప్యం ఆలస్యమవుతుందని, తద్వారా వాటి ఆయువు 23 శాతం పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానం మనుషుల్లోనూ వర్తిస్తుందని వారు విశ్వసిస్తున్నారు. ఎలుకల్లో సర్టియిన్‌-6 ప్రొటిన్‌ను పెంచడం వల్ల జీవిత కాలం పెరగడంతోపాటు అవి యవ్వనంగా కనిపిస్తున్నాయని, సాధారణ ఎలుకలతో పోలిస్తే వీటికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అయితే ఆడ, మగ ఎలుకల్లో జీవితకాలం పెరుగుదలలో వ్యత్యాసం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.  

యూఎస్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఇజ్రాయెల్‌లోని బార్‌-ఇలాన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ హైమ్‌ కొహెన్‌ మాట్లాడుతూ ‘ఎలుకల్లో ఆయుర్దాయం పెరగడం చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీన్నే మనుషులపై ప్రయోగిస్తే కచ్చితంగా మనిషి జీవితకాలం 120 ఏళ్లకు పెరుగుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని