కరోనాకు అంతం అప్పుడే..! - it takes seven years to control covid says bloomberg
close
Published : 05/02/2021 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు అంతం అప్పుడే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారి 2019 డిసెంబర్‌లో తొలుత కనుగొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న.. కరోనాకు అంతం ఎప్పుడు అనేదే. కాగా, దీనికి జవాబును అంతర్జాతీయంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ గణాంకాల ఆధారంగా కనుగొనవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచ జనాభాలో 70 నుంచి 85 శాతం ప్రజలకు వ్యాక్సిన్‌ అందినప్పుడే ప్రపంచం సాధారణ స్థితికి రాగలదని ఆంథొనీ ఫౌచీ వంటి వైద్యారోగ్య నిపుణులు అంటున్నారు. ఈ అంచనాల ప్రకారం కొవిడ్‌ అదుపులోకి వచ్చి ప్రపంచం మళ్లీ సాధారణ స్థితికి చేరేందుకు కనీసం ఏడు సంవత్సరాలు పడుతుందని బ్లూమ్‌బర్గ్‌ లెక్క కట్టింది.

వివిధ దేశాల్లో ప్రజలకు అందచేస్తున్న కొవిడ్‌ టీకాల సంఖ్యల ఆధారంగా బ్లూమ్‌బర్గ్‌ అతిపెద్ద డాటాబేస్‌ను తయారుచేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 119 మిలియన్ల కరోనా టీకా డోసులు వేసినట్టు ఈ సంస్థ తెలిపింది.
కొవిడ్‌ టీకా అందించే విషయంలో సంపన్న,  పేద దేశాల మధ్య తేడాలు లేకపోలేదు. ఉదాహరణకు ఇజ్రాయెల్‌  కేవలం రెండే నెలల్లో 75 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకుని .. ఆ ఘనత సాధించిన తొలిదేశంగా నిలిచింది. ఇక అమెరికా ఆ మార్కును 2022 నూతన సంవత్సర ఆరంభానికల్లా చేరుకుంటుందని అంచనా. ఐతే మిగిలిన పలు దేశాల వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కాస్త తక్కువ వేగంతో సాగుతుందనేది కాదనలేని సత్యం. అమెరికాతో సహా మొత్తం 68 దేశాల నుంచి సేకరించిన సమాచారం, గణాంకాల ఆధారంగా లెక్కించారు. ఒక వ్యక్తికి రెండు టీకా డోసులు అవసరమనే భావనను, అంతర్జాతీయ సరాసరి వ్యాక్సిన్‌ రేటును సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఆ మేరకు వేసిన లెక్కల్లో కొవిడ్‌ రహిత ప్రపంచ సాధనకు ఏడు సంవత్సరాలు పడుతుందని గణాంకాలు చెపుతున్నాయి.
భవిష్యత్తులో భారత్‌, మెక్సికో వంటి దేశాల్లో వ్యాక్సిన్ల తయారీ వేగవంతం కావటం.. మరిన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ వ్యవధి మరింత తగ్గే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. అదే విధంగా వ్యాక్సిన్‌ పంపిణీ తొలి దశలో తలెత్తే సమస్యలు, అనంతర కాలంలో ఎదురవ్వగల ఇతర ఆటంకాలు ఈ గణాంకాలపై ప్రభావం చూపవచ్చనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలనీ నిపుణులు తెలిపారు.

ఇవీ చదవండి..

సింగిల్‌ డోసు టీకా

 అది చైనా సరకే..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని