సిరాజ్‌ ఉద్వేగానికి ఆశ్చర్యపోయా: అశ్విన్‌ - it was exciting to see how siraj celebrated ashwin
close
Published : 16/02/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిరాజ్‌ ఉద్వేగానికి ఆశ్చర్యపోయా: అశ్విన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లతో అదరగొట్టిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో శతకం (106)తో చెలరేగాడు. అయితే మూడంకెల స్కోరును అందుకున్నప్పుడు సహచర ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఉద్వేగాన్ని చూసి ఆశ్చర్యపోయానని అశ్విన్‌ తెలిపాడు.

‘‘ప్రస్తుతం నా ఆలోచన.. రేపటికి ఎలా కోలుకుంటానో, రాత్రి ఎలా నిద్ర పడుతుందోనని మాత్రమే. అయితే గత కొన్ని మ్యాచ్‌ల్లో నా బ్యాటింగ్ మెరుగవ్వడానికి కారణం బ్యాటింగ్ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌. కొత్త టెక్నిక్‌లతో అతడు సాయం చేశాడు. అతడికే క్రెడిట్ ఇవ్వాలి. ఇక సొంత మైదానం (చెన్నై)లో మళ్లీ టెస్టు ఎప్పుడు ఆడతానో తెలియదు. అయితే ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలపడానికి కేవలం థ్యాంక్స్‌ అనే మాట సరిపోదు’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

‘‘గతంలో టెస్టుల్లో శతకాలు సాధించినప్పుడు ఇషాంత్ శర్మ మరో ఎండ్‌లో ఉండేవాడు. అయితే ఇప్పుడు సిరాజ్ ఉన్నాడు. బంతి లైన్‌ను గమనిస్తూ బ్యాటింగ్ చేయమని సిరాజ్‌కు సూచించాను. అయితే నేను శతకం సాధించినప్పుడు సంతోషంతో అతడు చేసిన సంబరాలు చూశాక ఆశ్చర్యపోయా. మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది’’ అని అశ్విన్ అన్నాడు.

అశ్విన్‌ వ్యక్తిగత స్కోరు 78 వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆఖరి బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సిరాజ్‌ చక్కని డిఫెన్స్‌తో అశ్విన్‌ శతకం పూర్తిచేశాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో బౌండరీ బాది అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. అయితే ఆ క్షణంలో సిరాజ్‌ సంతోషంతో బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. కాగా, సిరాజ్‌ వ్యక్తిత్వాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. సహచరుల విజయాన్ని ఆస్వాదిస్తున్న సిరాజ్‌ను ఎవరూ ద్వేషించలేరని పోస్ట్‌లు పెడుతున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని