INDvsENG: బుడగ టు బుడగ..  ఇంగ్లాండ్‌కు సూర్య, పృథ్వీ - its official suryakumar shaw to join indian team in uk easwaran added to main squad
close
Published : 26/07/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INDvsENG: బుడగ టు బుడగ..  ఇంగ్లాండ్‌కు సూర్య, పృథ్వీ

అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

దిల్లీ: శ్రీలంకలో పర్యటిస్తున్న పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ కోహ్లీసేనలో చేరడం ఖాయమైంది. వారిద్దరూ ఇంగ్లాండ్‌కు వెళ్లి టీమ్‌ఇండియా తరఫున ఆడతారని బీసీసీఐ ప్రకటించింది. స్టాండ్‌ బై ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ సైతం ప్రధాన జట్టులో భాగం కానున్నాడు. అతడితో పాటు వృద్ధిమాన్‌ సాహా, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఐసోలేషన్‌ ముగిసిందని బోర్డు కార్యదర్శి జే షా ప్రకటించారు.

గాయాల కారణంగా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. స్టాండ్‌ బై పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ ఎడమచేతి బొటన వేలు విరగడంతో అతడూ భారత్‌కు బయల్దేరనున్నాడు. వీరి స్థానాలను పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌తో సెలక్షన్‌ కమిటీ భర్తీ చేయనుంది.

‘సెలక్షన్‌ కమిటీ పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్లను సూచించింది. వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడ్డ వేలికి వైద్యం తీసుకున్నాడు. కోలుకొనేందుకు మరింత సమయం పట్టనుంది. బౌలింగ్‌  ఫిట్‌నెస్‌ లేకపోవడంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఫాస్ట్‌బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ సైతం గాయంతో భారత్‌కు వచ్చేస్తున్నాడు’ అని జే షా తెలిపారు.

కొవిడ్‌-19 నుంచి రిషభ్ పంత్‌ పూర్తిగా కోలుకున్నాడని జే షా వెల్లడించారు. బీసీసీఐ వైద్య సిబ్బంది అనుమతి రావడంతో టెస్టులకు సన్నద్ధమవుతున్నాడని పేర్కొన్నారు. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ను ఎంపిక చేస్తారని ఊహించినా అలాంటిదేం జరగలేదు. ప్రస్తుతం షా, సూర్య శ్రీలంకలో బయో బుడగలో ఉన్నారు. అక్కడ్నుంచి నేరుగా ఇంగ్లాండ్‌లోని బుడగకు చేరుకుంటారు. కాబట్టి ఐసోలేషన్‌, క్వారంటైన్‌ నిబంధనలు ఉండకపోవచ్చు!



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని