బిగ్‌న్యూస్‌: రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబో ఫిక్స్‌ - its official shankar charan combo fix
close
Updated : 12/02/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిగ్‌న్యూస్‌: రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబో ఫిక్స్‌

హైదరాబాద్‌: ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారనే విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొని ఉంది. పలువురు డైరెక్టర్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్‌చరణ్‌ తన 15వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్‌తో చేయనున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. చరణ్‌-శంకర్‌ కాంబో ఫిక్స్‌ అని పేర్కొంటూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ వెల్లడించింది.

‘‘ఇది మాకొక మైలురాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై 50వ చిత్రంగా ఇంతకు ముందెప్పుడూ చూడని రెండు బలమైన శక్తులను కలిపి తెరపై చూపించబోతున్నాం. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఇండియన్‌ సినిమా షో మెన్‌ శంకర్‌లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ -ట్విటర్‌లో చిత్ర నిర్మాణ సంస్థ

పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాలో చరణ్‌తోపాటు యశ్‌ కూడా భాగమయ్యే అవకాశాలున్నాయంటూ  కొన్ని రోజుల నుంచి సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ షూట్‌లో బిజీగా ఉన్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, శంకర్‌-కమల్‌హాసన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు-2’ షూట్‌ లాక్‌డౌన్‌ అనంతరం ఇంకా ప్రారంభం కాలేదు. ఇది పూర్తయిన తర్వాత చరణ్‌ సినిమా ఉంటుందా? లేక ప్రస్తుతానికి ‘భారతీయుడు-2’ పక్కన పెడతారా? తెలియాల్సి ఉంది. తాజా ప్రకటనతో మెగా అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇవీ చదవండి

వైష్ణవ్‌.. నీ భయం నాకు తెలుసురా

క్రేజీ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌లు ఫిక్స్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని