జూన్‌లో ఓటీటీ వేదికగా ‘జగమే తంత్రం’! - jagame tantram is going to release netflix june
close
Published : 23/04/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూన్‌లో ఓటీటీ వేదికగా ‘జగమే తంత్రం’!

ఇంటర్నెట్‌ డెస్క్: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలి నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు ధనుశ్‌. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన తమిళ చిత్రం ‘జగమే తందిరమ్‌’. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌డౌన్‌/కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. 

ఈ ఏడాది జూన్‌ 11 లేదా 13వ తేదీన విడుదల చేయాలనే దానిపై చర్చలు నడుస్తున్నాయట. వచ్చే నెలలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేయనున్నారట. ధనుష్‌ ఇందులో సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రంగా ఉండనుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వై నాట్‌ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర నిర్మాతలు. సంతోష్‌ నారాయణ స్వరాలు సమకూరుస్తుండగా వివేక్ హర్షన్‌ ఎడిటర్‌ పనిచేశారు. ధనుశ్‌కి ఇది 40వ సినిమా కావడం విశేషం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని