Jagapathi Babu: జ‌గ‌ప‌తి జీవితం.. 59 ఏళ్ల క్రితం - jagapathi babu life story samudram its my life
close
Published : 17/06/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jagapathi Babu: జ‌గ‌ప‌తి జీవితం.. 59 ఏళ్ల క్రితం

ఇంట‌ర్నెట్ డెస్క్‌: క‌థానాయ‌కుడిగా ఎంత గుర్తింపు పొందారో ప్ర‌తినాయ‌కుడిగా అంత‌కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు జ‌గ‌ప‌తి బాబు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కనిర్మాత వి.బి. రాజేంద్ర ప్ర‌సాద్ వార‌సుడిగా తెరంగ్రేటం చేసిన జ‌గ‌ప‌తి బాబు వృత్తిప‌రంగా, వ్య‌క్తిగ‌తంగా ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను చూశారు. వాట‌న్నింటినీ ప్రేక్ష‌కుల‌తో పంచుకునేందుకు సిద్ధ‌మ‌య్యారాయ‌న‌. ‘స‌ముద్రం: ఇట్స్ మై లైఫ్’ పేరుతో ఓ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. 59 ఏళ్లుగా త‌న ప్ర‌యాణం ఎలా సాగింది? న‌టుడిగా ఎలా మారారు? ఇత‌ర భాషా చిత్రాల అవ‌కాశాలు, కుటుంబం తదిత‌ర విష‌యాల్ని ఇందులో ఆవిష్క‌రించ‌నున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోని విడుద‌ల చేశారు జ‌గ‌ప‌తి. ‘‘59 ఏళ్ల క్రితం.. నా జీవితం గురించి మీ అంద‌రితో చెప్పాల‌నుకుంటున్నాను. స‌ముద్రం: ఇట్స్ మై లైఫ్. జూన్ 18 సాయంత్రం 6 గంటల నుంచి’’ అని జ‌గ‌ప‌తి చెప్పిన వాయిస్ ఓవ‌ర్‌తో ఆసక్తిగా సాగింది ప్రోమో. త‌న ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించ‌వ‌చ్చు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని