UK: బ్రిటన్‌ కొవిడ్‌ ప్రయాణ నిబంధనలు.. భారత్‌ ఏమందంటే.. - jaishankar raises covid-19 quarantine issue during his meeting with uk counterpart
close
Updated : 21/09/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

UK: బ్రిటన్‌ కొవిడ్‌ ప్రయాణ నిబంధనలు.. భారత్‌ ఏమందంటే..

దిల్లీ: టీకా పొందిన భారతీయులను టీకా తీసుకోనట్లుగా పరిగణిస్తూ యూకే ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్‌ ప్రయాణ నిబంధనలు కొత్త వివాదానికి తెరలేపాయి. దీంతో ఈ పరిణామాలపై స్పందించిన భారత్.. పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని యూకేను కోరింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేడు యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన కేంద్రమంత్రి.. క్వారంటైన్‌ నిబంధనల వివాదాన్ని కూడా ప్రస్తావించారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్‌ తెలిపారు. 

అక్టోబరు 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్‌ నిబంధలను బ్రిటన్‌ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. దాని ప్రకారం  భారత్‌, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్‌ రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. ఆ దేశాల నుంచి వచ్చే వారు.. తమ ప్రయాణానికి ముందుగా, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనల పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్‌ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయని, ఇది పూర్తిగా నేరపూరిత చర్యేనని మండిపడ్డారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని