‘చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి’ - janasen president pawan kalyan fires on ysrcp and tdp mlas
close
Published : 02/08/2020 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి’

వైకాపా, తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

డిమాండ్‌ చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్

హైదరాబాద్‌: అమరావతి రైతుల కోసం తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు వైకాపా ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలన్నారు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని