భాజపా, జనసేన ధర్మపరిరక్షణ దీక్ష - janasena and bjp protest on anthrvedi incident
close
Published : 10/09/2020 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా, జనసేన ధర్మపరిరక్షణ దీక్ష

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా అతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి  దివ్యరథం దగ్ధమైన ఘటనను నిరసిస్తూ జనసేన, భాజపా ఆందోళనబాట పట్టాయి. రెండు పార్టీల నేతలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. దీక్షకు ముందు జనసేన ముఖ్య నాయకులతో చర్చించారు.

దిల్లీలో జీవీఎల్‌ దీక్ష

అంతర్వేది ఘటనపై సీఎం న్యాయ విచారణ జరిపించాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. అంతర్వేది ఘటనకు నిరసనగా దిల్లీలోని తన నివాసంలో లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేసి నిరసన దీక్షలో కూర్చున్నారు.  అరెస్టు చేసిన భాజపా, జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జీవీఎల్‌తో పాటు ఆ పార్టీ నేతలు సునీల్‌ దేవధర్‌, సత్యకుమార్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

 

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు...

పెద్దవాల్తేరు: హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని శాసన మండలి సభ్యుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. గురువారం విశాఖలోని భాజపా కార్యాలయంలో అంతర్వేది ఘటనకు నిరసనగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటి వరకు పలు దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయంగా భావిస్తున్నారన్నారని ఆరోపించారు. మసీదులు, చర్చిలకు వచ్చే ఆదాయాలు ఆ మతస్థులు మాత్రమే వినియోగించుకుంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు హిందూ  దేవాలయాలను రక్షించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అంతర్వేది ఘటనకు సంబంధించి   ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. దేవాలయ భూముల విక్రయం, వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇచ్చే చర్యలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్య మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేయడాన్ని ప్రభుత్వం పిచ్చివాడి చర్యగా చెబుతోందని,  అక్కడి  కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ కూడా అలాగే నివేదికలు ఇవ్వడం శోచనీయమన్నారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు ఎం.రవీంద్ర తదితరులు దీక్షలు పాల్గొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని