శ్రీవారి సేవలో పవన్‌ కల్యాణ్‌ - janasena chief pawan kalyan visits tirumala temple
close
Published : 22/01/2021 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారి సేవలో పవన్‌ కల్యాణ్‌

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న జనసేనానికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఏడాది నుంచి స్వామివారి ఆశీస్సుల కోసం రావాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రాలేకపోయానని.. ఇవాళ స్వామివారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. 

ఇవీ చదవండి..
అంతుచిక్కని కారణాలతో పలువురికి అస్వస్థత

టీకా అనుభవాలు తెలుసుకోనున్న మోదీ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని