‘అమ్మోనియం నుంచి విశాఖను కాపాడండి’ - janasena president pawan kalyan on amoniam nitrete in vizag
close
Published : 10/08/2020 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అమ్మోనియం నుంచి విశాఖను కాపాడండి’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్‌ కల్యాణ్ విజ్ఞప్తి

అమరావతి: అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల నుంచి విశాఖ నగరాన్ని కాపాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. నిపుణుల హెచ్చరికలు పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పొరపాటుగా ఏదైనా జరిగితే ఊహకే అందనిదిగా ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదాల దృష్ట్యా పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఒకే చోట పెద్ద మొత్తంలో నిల్వలు చేయకుండా వికేంద్రీకరణ జరపడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఉదాసీనత వహిస్తే జరగరానిది జరిగితే నష్టం అంచనా వేయడం కూడా కష్టమవుతుందని తెలిపారు. విజయవాడ శివారులోనూ అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేస్తున్నట్లు  ప్రసారమాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. జనవాసాలు మధ్య నిల్వ చేయడం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి విశాఖ, విజయవాడ నగరాల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్‌ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని