స్టీల్‌ప్లాంట్‌పై వైకాపా నాటకాలు ఆడుతోంది: పవన్‌ - janasena pressnote on vizag steelplant
close
Published : 07/03/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టీల్‌ప్లాంట్‌పై వైకాపా నాటకాలు ఆడుతోంది: పవన్‌

హైదరాబాద్‌: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వైకాపా చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చేస్తున్న డ్రామాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ దుయ్యబట్టారు. 22 మంది వైకాపా ఎంపీలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్‌ ప్లాంట్ కోసం దిల్లీలో ఏం చేశారో చెప్పాలన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా తమ వాణిని వినిపించాలన్నారు. అలా కాకుండా కేవలం మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లకోసం రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.  అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక్క వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన తీసుకురాలేదని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వసంస్థలు, పరిశ్రమలు నడపడంలో వస్తున్న ఒడిదొడుకుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు.

అయినా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తున్నానన్నారు. ఆ కారణంగానే దిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసి స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రులకు ఎంత ప్రాధాన్యమైనదో వివరించానన్నారు. నాడు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలు ఇప్పటికీ పరిహారం కోసం పోరాటం చేస్తున్నాయని గుర్తు చేసినట్టు పేర్కొన్నారు. ఉక్కు ఉద్యమంలో జరిగిన ఆత్మబలిదానాల త్యాగాలను అమిత్‌షాకు వివరించినట్టు తెలిపారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రత్యేక దృష్టితో చూడమంటూ వినతిపత్రం సమర్పించినట్టు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని