పెళ్లి కుమార్తెగా జాన్వీకపూర్‌.. ఫొటోలు వైరల్‌ - janhvi Kapoor Bride Look Photos Viral
close
Published : 25/09/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి కుమార్తెగా జాన్వీకపూర్‌.. ఫొటోలు వైరల్‌

వీడియో షేర్‌ ప్రముఖ డిజైనర్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ పెళ్లి కుమార్తె దుస్తుల్లో మెరిసిపోయారు. బంగారు, ఆకుపచ్చ వర్ణ దుస్తులతో పాటు విలువైన ఆభరణాలను ధరించి మేలి ముసుగులో కనువిందు చేశారు. ఓ ఫొటోషూట్‌లో భాగంగా దుస్తులు ధరించిన ఆమె, తన అందంతో అభిమానులను ఫిదా చేశారు. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించిన దుస్తులంటే నటీనటులు ఎక్కువగా మనసు పారేసుకుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హెరిటేజ్‌ కలెక్షన్స్‌ పేరుతో సరికొత్త దుస్తులను సిద్ధం చేశారు. ప్రమోషన్‌లో భాగంగా ఓ యాడ్‌ షూట్‌ నిర్వహించారు. అయితే సదరు యాడ్‌ షూట్‌లో పాల్గొన్న జాన్వీకపూర్‌ పెళ్లి కుమార్తెగా ముస్తాబై కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘మీకు ఎవరికైనా సన్నాయి మేళం వినిపిస్తోందా? లేక నాకు ఒక్కదానికే అలా అనిపిస్తోందా?మనీష్‌ మల్హోత్రా సరికొత్త కలెక్షన్స్‌లో నేను కూడా ఒక భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని జాన్వీ తెలిపారు. అంతేకాకుండా ఈ యాడ్‌ షూట్‌ని పూర్తిగా ఎంజాయ్‌ చేశానని పేర్కొన్నారు.

మరోవైపు డిజైనర్‌ మనీష్‌ సైతం తాను రూపొందించిన సరికొత్త దుస్తుల కలెక్షన్స్‌కి సంబంధించి ఓ ప్రత్యేక వీడియో ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు. సదరు వీడియోలో జాన్వీ కపూర్‌ని చూసిన చాలా మంది నెటిజన్లు.. ‘జాన్వీ‌.. మీరు రాకుమారిలా ఉన్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా మనీష్‌ కలెక్షన్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు.

‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రంలో జాన్వీ ప్రదాన పాత్రలో నటించారు. కార్గిల్‌ గర్ల్‌గా పేరుపొందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. శరణ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు నెలలో ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని