నేనెంతో అదృష్టవంతురాలిని: జాన్వీ - janhvi feels lucky to having opportunities
close
Published : 25/07/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేనెంతో అదృష్టవంతురాలిని: జాన్వీ

ముంబయి: సినీ నేపథ్యం ఉన్న కుటుంబం ఉండటం వల్లే తనకు అవకాశాలు వచ్చాయని అంటున్నారు యువ కథానాయిక జాన్వీ కపూర్. దివంగత సినీతార శ్రీదేవి.. నిర్మాత బోనీ కపూర్‌ వారసురాలిగా ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె.. తన కుటుంబ నేపథ్యంపై తాజాగా మాట్లాడింది. ఓటీటీ వేదికగా విడుదల కాబోతున్న ‘గుంజన్‌ సక్సెనా:ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషించింది. గుంజన్‌ సక్సెనాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తనని తాను అదృష్టవంతురాలిగా చెప్పుకుంది.

‘‘ప్రస్తుతం బాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేవీ నాకు ఎదురుకాలేదు. ఎందుకంటే నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడ నాకు లభిస్తున్న గౌరవం.. అవకాశాలను చూస్తుంటే నేను ఎంతో అదృష్టవంతురాలినని అనిపిస్తుంది’’అని జాన్వీ చెప్పుకొచ్చింది.

ఇక సినీ పరిశ్రమలో లింగభేదం గురించి చెబుతూ ‘‘కొన్నిసార్లు సినిమా కథ చెప్పేటప్పుడు దర్శకులు ఎక్కువగా హీరోపైనే ఎక్కువ దృష్టి పెడతారు. సినిమాలో హీరో పాత్రే కీలకం కాబట్టి అలా చేస్తారని భావించేదాన్ని. కానీ వారికి తెలియకుండానే అదో అలవాటుగా మారిందని ఆ తర్వాత తెలుసొచ్చింది’’అని తెలిపారు. ప్రస్తుతం జాన్వీ ‘రూహి అఫ్జానా’.. ‘దోస్తానా-2’ చిత్రాల్లో నటిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ వాయిదా పడ్డాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని