Janhvi kapoor: వారిని నిరాశ పరచను - janhvi kapoor about her fans
close
Published : 03/06/2021 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Janhvi kapoor: వారిని నిరాశ పరచను

‘‘అమ్మతో పోల్చడం అనేది నాపై ఒత్తిడి పెంచదు. బాధ్యతను పెంచుతుంది’’ అంటోంది జాన్వీ కపూర్‌. శ్రీదేవి ముద్దుల తనయగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు తొలిచిత్రం ‘దఢక్‌’తోనే మంచి నటనతో ఆకట్టుకుంది. తర్వాత ‘గుంజన్‌ సక్సేనా’తో తన ప్రతిభను నిరూపించుకుంది.

ఇటీవల ఓ ఫ్యాషన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అందాల భామ మాట్లాడుతూ ‘అమ్మతో నన్ను పోల్చి చూడటం అదృష్టంగా భావిస్తాను. ఆమె వల్లే నాకు ఈ జీవితం లభించింది. ఇంతమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఆమె నాకు ఎప్పటికీ ఆదర్శమే. అమ్మంతా కాకపోయినా నా నటనతో అభిమానులను ఎప్పుడూ నిరాశ   పరచను. వారంతా నాలో అమ్మను చూసుకుంటున్నారు. అందుకే అమ్మ శ్రీదేవితో పోల్చడం నా బాధ్యతను మరింత పెంచుతుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె ‘దోస్తానా-2’ చిత్రంలో నటిస్తోంది.

జాన్వీకపూర్‌ ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌చేయండి



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని