close
Published : 26/02/2021 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ విషయంలో వెనుకాడను: జాన్వీ

ముంబయి: శ్రీదేవి తనయగా చిత్ర పరిశ్రమలోకి  అడుగుపెట్టిన జాన్వీకపూర్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడుతోంది. గ్లామర్‌ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలవైపు అడుగులేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. కొందరు త్వరగానే గుర్తింపు సాధిస్తారు. అలాంటి యువతరం నాయికల్లో సారా అలీఖాన్, అనన్యా పాండే కూడా ఉన్నారు. ప్రత్యేకంగా వీళ్ల గురించే ఎందుకంటే జాన్వీకపూర్‌కి వీళ్లిద్దరే పోటీ అని బాలీవుడ్‌లో అనుకుంటున్నారట.

ఓ ఇంటర్య్వూలో జాన్వీని అడిగితే ‘‘మా మధ్య ఉండేది ఆరోగ్యకరమైన పోటీయే కానీ, కొందరు దాన్ని చూడటంలోనే తేడా ఉంది. చిత్ర పరిశ్రమలో పదిమంది హీరోయిన్‌లు ఉంటే మా ముగ్గురి మధ్యే పోటీ ఉందని అనడం ఏంటి? నేను అయితే ఇవన్నీ పట్టించుకోను. నా తోటి నాయికల సినిమాలు బాగుంటే వాళ్లని అభినందించడానికి నేను అస్సలు వెనుకాడను’’ అని చెప్పింది జాన్వీ.

ఆమె నటించిన హారర్‌ చిత్రం ‘రూహ్‌’ మార్చి 11న విడుదల కానుంది. ‘‘తనలో నటిని బయటకు తీసుకొచ్చి   ప్రేక్షకులకు పరిచయం చేసే పాత్రల్ని ‘రూహ్‌’లో పోషించాను. నాకు ఎంత సవాల్‌గా అనిపించాయో అంతకంటే ఎక్కువగా ఎంజాయ్‌ చేశాను’’అంటోంది జాన్వీ. ఆమె ప్రస్తుతం ‘దోస్తానా 2’, ‘గుడ్‌ లఖ్‌ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని