‘గుడ్‌ లక్‌ జెర్రీ’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న జాన్వీ - janhvi kapoor completes filming for good luck jerry
close
Published : 20/03/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గుడ్‌ లక్‌ జెర్రీ’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న జాన్వీ

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ కథానాయిక జాన్వీ కపూర్‌ నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ జెర్రీ’. సిద్ధార్థ్ సేన్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ..‘‘ఈ చిత్రం ఇంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. సినిమా షూటింగ్‌ సమయంలో ఎంతో నేర్చుకున్నా. చిత్రీకరణ సమయంలో చాలామంది ముఖాల్లో కొంత నిరాశ కనిపించింది. వాటిని దూరం చేయడానికి సెట్లో అందరినీ నవ్వించేదాన్ని. దాంతో అవన్నీ మరిచిపోయి షూటింగ్‌లో పాల్గొనేవాళ్లు. అందరం కలిసి పనిచేశాం. మీ అందరిని మిస్ అవుతున్నా. ప్రతిఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ తెలిపింది.

‘గుడ్‌ లక్‌ జెర్రీ’ చిత్రం 2018లో తమిళంలో నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘కోలమావు కోకిలా’ చిత్రానికి రీమేక్‌. ప్రస్తుతం జాన్వీ - కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'దోస్తానా 2'లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన హర్రర్‌ చిత్రం ‘రూహి’లో అఫ్జానాగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని