జాన్వీ కపూర్‌ కొత్త ఇంటి ధరెంతో తెలుసా? - janhvi kapoor gifts rs 39 crore triplex house to herself
close
Published : 05/01/2021 18:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాన్వీ కపూర్‌ కొత్త ఇంటి ధరెంతో తెలుసా?

ముంబయి: శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన జాన్వీకపూర్‌ వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. తాజాగా ఆమె ఒక కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ముంబయిలో ఐశ్వర్యవంతుల ఇలాకాగా పేరొందిన జూహు విలే పార్లే ప్రాంతంలోని  అపార్ట్‌మెంట్‌లో ఈ ఫ్లాట్‌  ఉంది. సుమారు రూ.39 కోట్ల విలువ కలిగిన ఈ ఫ్లాట్‌ 14,15,16 ఫ్లోర్ల వరకు విస్తరించి ఉంది. అలాగే ఆరు కార్లు వరకు నిలిపే పార్కింగ్‌ స్థలం కూడా ఆ బిల్డింగ్‌లో ఏర్పాటు చేశారు. ఆమెకు సమీపంలోనే బిగ్‌బీ అమితాబ్‌, అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవగణ్‌, ఏక్తా కపూర్‌ వంటి సినీ ప్రముఖులు ఇళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు జాన్వీ తన తండ్రి బోనికపూర్‌, సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి లోఖండ్‌వాలాలోని ఉంటోంది. ప్రస్తుతం జాన్వీ దోస్తానా-2లో కార్తీక్‌ ఆర్యన్‌ సరసన, రోహి అఫ్జానా చిత్రంలో రాజ్‌కుమార్‌రావు పక్కన నటిస్తోంది. గతేడాది గుంజన్‌ సక్సేనా చిత్రంలో జాన్వీ నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి!

రూలంటే రూలే: క్వారంటైన్‌కు సల్మాన్‌ సోదరులు

క్రాకెక్కిస్తున్న ‘మాస్‌ బిర్యానీ’ సాంగ్‌
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని