పంజాబ్‌కు జాన్వీ - janhvi kapoor to punjab for movie shooting
close
Published : 06/01/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంజాబ్‌కు జాన్వీ

ముంబయి: బాలీవుడ్‌ యువ కథానాయిక జాన్వీకపూర్‌ గత ఏడాది ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో విజయం సాధించిన ‘కొలమావు కోకిల’ను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. వీటిలో జాన్వీ కపూర్‌ నాయికగా నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఈ నెల 9వ తేదీ నుంచి సెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్‌లో 45 రోజుల పాటు జరగనుంది. సిద్ధార్థ్‌ సేన్‌ గుప్తా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులకు తగినట్లు పలు మార్పులు చేయనున్నారట. జాన్వీ నటించిన ‘రూహీ ఆఫ్జానా’ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ‘దోస్తానా 2’ సెట్స్‌పై ఉంది. త్వరలోనే మరికొన్ని చిత్రాల సంగతులు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి!

అలాంటి అనుమతులు ఇక్కడా ఇవ్వండి

‘మీరు డాక్టర్‌ను కలిస్తే మంచిది’ 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని