ఎన్టీఆర్‌ పాట.. మరోసారి ఫిదా చేసిన జపాన్‌ జంట - japanese Couple dance to NTR song
close
Published : 18/09/2020 13:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ పాట.. మరోసారి ఫిదా చేసిన జపాన్‌ జంట

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న డ్యాన్స్ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: వైవిధ్యమైన నటన, సూపర్‌ డ్యాన్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. పాటకు అనుగుణంగా ఆయన వేసే స్టెప్పులను చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇటీవల ఎన్టీఆర్‌ నటించిన ‘సింహాద్రి’ సినిమాలోని ‘చీమ.. చీమ...’, ‘అశోక్‌’ చిత్రంలోని ‘గోల.. గోల...’ అనే పాటలకు స్టెప్పులేసిన జపాన్‌ జంట మరోసారి కొత్త పాటతో మెప్పించారు.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కంత్రి’. హన్సిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలోని ‘వయస్సునామీ’ పాట అప్పట్లో ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఇందులో ఎన్టీఆర్‌-హన్సిక వేసే స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈపాటకు జపాన్‌లోని హీరోమునిరు, అశాహి ససాకీ నృత్యం చేశారు. అనంతరం సదరు వీడియోను యూట్యూబ్‌ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. హీరోమునిరు డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు.. సూపర్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని